#### Apple ఒక సంవత్సరం పరిమిత వారెంటీ సారాంశం అందించబడిన హార్డ్‌వేర్ ప్రోడక్ట్, యాక్సెసరీలకు అసలైన రిటైల్ కొనుగోలు తేదీ నుండి ఒక సంవత్సరం పాటు మెటీరియల్స్, తయారీ లోపాలపై Apple వారంటీ ఇస్తుంది. సాధారణంగా గీతలు పడటం, పగిలిపోవడం లేదా ప్రమాదం / దుర్వినియోగం వలన కలిగే నష్టాలకు Apple వారంటీ ఇవ్వదు. ఏదైనా సర్వీస్‌ను పొందడానికి, Appleకు కాల్ చేయండి లేదా Apple స్టోర్ లేదా Apple ప్రామాణిక సర్వీస్ ప్రొవైడర్‌ను సందర్శించండి, అందుబాటులో ఉన్న సర్వీస్ ఎంపికలు, సర్వీస్‌ను అభ్యర్థించిన దేశంపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి ఇవి విక్రయించిన అసలు దేశానికి మాత్రమే పరిమితం కావచ్చు. లొకేషన్ ఆధారంగా కాల్ ఛార్జీలు, అంతర్జాతీయ షిప్పింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. పూర్తి నిబంధనలకు లోబడి, సర్వీస్‌ను ఎలా పొందాలనే దాని గురించిన వివరణాత్మక సమాచారం [apple.com/legal/warranty](https://www.apple.com/legal/warranty/), ఇంకా [support.apple.com](https://support.apple.com/en-in) లింక్‌లో ఉంది, మీరు ఈ వారంటీకి సంబంధించి చెల్లుబాటు అయ్యే క్లెయిమ్‌ను సమర్పిస్తే, Apple వారి స్వంత నిర్ణయాలకు తగినట్లు మీ హార్డ్‌వేర్ డివైజ్‌ను రిపేర్ చేస్తారు, రీప్లేస్ చేస్తారు లేదా దానికి రీఫండ్ ఇస్తారు. స్థానిక వినియోగదారు చట్టాల ప్రకారం అందించబడిన హక్కులతో పాటు వారంటీ ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ వారంటీకి లోబడి క్లెయిమ్ చేసేటప్పుడు కొనుగోలు వివరాలకు సంబంధించిన రుజువును అందించాల్సి ఉంటుంది. 011626-1 WAR-IN